కలెక్టర్‌కు మత్స్యకారుల కృతజ్ఞతలు

కలెక్టర్‌కు మత్స్యకారుల కృతజ్ఞతలు

VSP: బంగ్లాదేశ్ చెర నుంచి విముక్తి పొంది సురక్షితంగా స్వగ్రామానికి చేరుకున్న మత్స్యకారులు కలెక్టర్ ఎం.ఎన్. హరేంధిర ప్రసాద్‌ను సోమ‌వారం కలిసి కృతజ్ఞతలు తెలిపారు. తాము క్షేమంగా తిరిగి రావడంలో కలెక్టర్ చూపిన చొరవ మరువలేమని వారు ఈ సందర్భంగా పేర్కొన్నారు. తమ కుటుంబాల్లో వెలుగులు నింపిన ప్రభుత్వానికి కృత‌జ్ఞ‌త‌లు చెబుతున్నామ‌న్నారు.