నేడు అచ్చంపేటకు సీఎం రాక

నేడు అచ్చంపేటకు సీఎం రాక

NGKL: జిల్లా అచ్చంపేట నియోజకవర్గంలో సోమవారం రాష్ట్ర సీఎం రేవంత్ రెడ్డి పర్యటిస్తారని ఎమ్మెల్యే వంశీకృష్ణ తెలిపారు. అచ్చంపేట మండలంలోని మర్లపాడుతండా గ్రామంలో వరద ప్రవాహాన్ని ఏరియల్ వ్యూ ద్వారా పరిశీలిస్తారని పేర్కొన్నారు. అనంతరం మర్లపాడు ఎస్ఎల్బీసీ వద్ద అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహిస్తారని వెల్లడించారు.