'నాలుగవ అతిపెద్ద ఆర్థిక శక్తిగా భారత్'

NLR: భారత్ నాలుగవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఎదుగుతున్న నేపథ్యంలో, బీజేపీ రాష్ట్ర కార్యదర్శి కందికట్ల రాజేశ్వరి హర్షం వ్యక్తం చేశారు. మంగళవారం ఆమె మాట్లాడుతూ.. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దూరదృష్టి, విస్తృత ఆర్థిక సంస్కరణలు, మేక్ ఇన్ ఇండియా వంటి మార్గదర్శక కార్యక్రమాలే ఈ గొప్ప విజయానికి ఆధారాలు అన్నారు. 2028 నాటికి భారత్ జపాన్‌ను అధిగమిస్తుందన్నారు.