ఈనెల 26న శనీశ్వరుడికి ప్రత్యేక పూజలు

NLG: అడవిదేవులపల్లి మండల శివారులోని కృష్ణానది తీరంలోని బౌద్ధమ దేవాలయంలో ఈనెల 26న శనీశ్వరుడికి శని పూజ, శివునికి అభిషేకం, సూర్యనారాయణ స్వామికి ప్రత్యేక పూజలు నిర్వహించనున్నట్లు ఆలయ పూజారి యడవల్లి రఘురామశర్మ ఓ ప్రకటనలో తెలిపారు. శని త్రయోదశి సందర్భంగా ప్రత్యేక పూజ కార్యక్రమాలు జరుగుతాయని అన్నారు. భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొనాలని కోరారు.