VIDEO: వేదమంత్రాలతో విగ్రహాలకు జలాధివాస మహోత్సవం

VIDEO: వేదమంత్రాలతో  విగ్రహాలకు జలాధివాస మహోత్సవం

SRD: ఖేడ్ పట్టణంలోని నెహ్రూ నగర్ శ్రీ వీరాంజనేయ స్వామి ఆలయంలో ప్రతిష్ట మహోత్సవంలో భాగంగా శనివారం మొదటి రోజు గణపతి పూజలతో ప్రారంభమైంది. ఈ మేరకు శివ పంచాయతన విగ్రహాలకు వేదమంత్రాలతో వైదిక స్మార్త పురోహితులు గురురాజ శర్మ జలధివాసం నిర్వహించారు. యాగశాల ప్రవేశం, ప్రధాన దేవతా స్థాపన, అగ్నిస్థాపన మూలమంత్ర హోమాలు, మంత్రపుష్పం కార్యక్రమాలు ఘనంగా జరిగాయి.