'తాగేందుకు నీళ్లు లేవు.. జర పట్టించుకోండి సారు'

ADB: తలమడుగు మండలంలోని పల్సి(బి )గ్రామ ప్రజలకు గత వారం రోజులుగా మిషన్ భగీరథ నీరు రాక ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. గ్రామ ప్రజలు మిషన్ భగీరథ నీరు పైనే ఆధారపడి ఉంటారు. గత వారం నుండి నీళ్లు రాకపోవడంతో గ్రామ సమీపంలో ఉన్న బాబి నీళ్లు తెచ్చుకుంటున్నారు. కలుషిత నీరు తాగలేకపోతున్నామని, వెంటనే మిషన్ భగీరథ త్రాగు నీటిని సరఫరా చేయాలని గ్రామ ప్రజలు కోరుకుంటున్నారు.