KU PG హాస్టల్లో విద్యార్థులు ఆందోళన
WGL: పట్టణ కేంద్రంలోని కాకతీయ యూనివర్సిటీ నూతన PG హాస్టల్ మెస్‌లో ఉదయం వడ్డించిన ఇడ్లీల్లో పురుగులు కనిపించడంతో విద్యార్థుల్లో తీవ్ర ఆగ్రహం వ్యక్తమైంది. ఆహార నాణ్యతపై అసంతృప్తి వ్యక్తం చేస్తూ విద్యార్థులు హాస్టల్ ముందు ఆందోళనకు దిగారు. మెస్ నిర్వహణ అస్తవ్యస్తంగా ఉండటం, అధికారుల పర్యవేక్షణ లోపంతోనే ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు.