హైదరాబాద్‌లో ఐదంతస్థుల భవనం కూల్చివేత

హైదరాబాద్‌లో ఐదంతస్థుల భవనం కూల్చివేత

TG: హైదరాబాద్ మియాపూర్‌లోని ఓ అక్రమ కట్టడంపై హైడ్రా చర్యలకు దిగింది. సర్వే నం.100లోని ప్రభుత్వ భూమిలో నిర్మించిన ఐదంతస్థుల భవనాన్ని కూల్చివేస్తోంది. HMCA ఫెన్సింగ్ తొలగించడంతోపాటు సర్వే నంబర్లు మార్చి 307, 308 సృష్టించారని స్థానికుల నుంచి పెద్దఎత్తున ఫిర్యాదులు అందాయి. ఈ మేరకు రంగంలోకి దిగిన హైడ్రా అధికారులు పోలీసుల పహారా మధ్య భవనాన్ని కూల్చివేస్తున్నారు.