VIDEO: ఇంట్లో షార్ట్ సర్క్యూట్.. తప్పిన పెను ప్రమాదం

VIDEO: ఇంట్లో షార్ట్ సర్క్యూట్.. తప్పిన పెను ప్రమాదం

MNCL: మంచిర్యాల పట్టణం LIC కాలనీలో ఆదివారం విద్యుత్ షార్ట్ సర్క్యూట్‌తో కాలనీవాసి తుల జయంత్ నివాసంలోని వరండాలో ఉన్న మీటర్ నుంచి ఒక్కసారిగా పొగలు వ్యాపించాయి. భయబ్రాంతులకు గురైన కుటుంబ సభ్యులు అగ్నిమాపక కేంద్రానికి సమాచారం అందించారు. ఫైర్ సిబ్బంది హుటాహుటిన అక్కడికి చేరుకొని మంటలు ఆర్పేయడంతో పెను ప్రమాదం తప్పింది. ప్రమాదంలో ఆస్తి, ప్రాణ నష్టం జరగలేదు.