దేవనకొండలో సీఎం చంద్రబాబు జన్మదిన వేడుకలు

KRNL: దేవనకొండలో టీడీపీ మండల కన్వీనర్ విజయ్ భాస్కర్ గౌడ్ ఆధ్వర్యంలో ఆదివారం సీఎం చంద్రబాబు నాయుడు 75 జన్మదిన వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా వాల్మీకి రాష్ట్ర ఫెడరేషన్ ఛైర్మన్ బొజ్జమ్మ మాట్లాడుతూ.. ఆర్థికంగా కుంగిపోయిన రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలోకి తీసుకెళ్లడం చంద్రబాబు నాయుడు లాంటి దార్శనికుడికి మాత్రమే సాధ్యమని అన్నారు.