ఈ నెల 30 నుంచి జిల్లా స్థాయి సైన్స్‌ ఫెయిర్‌

ఈ నెల 30 నుంచి జిల్లా స్థాయి సైన్స్‌ ఫెయిర్‌

SRPT: హుజూర్‌నగర్‌లోని విజయ విద్యామందిర్ హైస్కూల్‌లో ఈ నెల 30, 31 తేదీల్లో జిల్లా స్థాయి సైన్స్‌ ఫెయిర్‌ నిర్వహించనున్నట్లు డీఈవో కే.అశోక్ ఇవాళ తెలిపారు. పర్యావరణం, ఆరోగ్యం, గణితం వంటి అంశాలపై ప్రాజెక్టులు ప్రదర్శించాలన్నారు. విద్యార్థుల్లోని శాస్త్ర సాంకేతిక నైపుణ్యాలను వెలికితీసేందుకు ఈ ప్రదర్శన దోహదపడుతుందని ఆయన పేర్కొన్నారు.