మొక్కజొన్న కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే
WGL: దుగ్గొండి మండల కేంద్రంలో మొక్కజొన్న కొనుగోలు కేంద్రాన్ని నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రైతులు మధ్యవర్తులను ఆశ్రయించకుండా ప్రభుత్వ కేంద్రాల్లోనే పంటను విక్రయించాలని సూచించారు. కాంగ్రెస్ ప్రభుత్వం మొక్కజొన్నకు క్వింటాలుకు రూ.2400 మద్దతు ధర అందిస్తోందని ఆయన తెలిపారు.