సమ్మెకు శ్రీధర్ రెడ్డి సంఘీభావం

సత్యసాయి: పుట్టపర్తిలో కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్లు చేస్తున్న సమ్మెకు మాజీ ఎమ్మెల్యే దుద్దుకుంటు శ్రీధర్ రెడ్డి సంఘీభావం తెలిపారు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత 7 నెలల బకాయిలు పెట్టడం, ఉద్యోగాలను క్రమబద్ధీకరించకపోవడం బాధాకరమన్నారు. రాష్ట్ర ప్రభుత్వం వారి డిమాండ్లను పరిష్కరించాలని కోరారు. వైసీపీ తరఫున అండగా ఉంటామని భరోసా ఇచ్చారు.