ట్యాంక్ బండ్‌లో గుర్తుతెలియని వృద్ధురాలు మృతదేహం
పెద్దపల్లి పట్టణంలోని ఎల్లమ్మ చెరువు మినీ ట్యాంక్ బండ్‌లో గుర్తుతెలియని వృద్ధురాలు పడి మృతి చెందింది. మంగళవారం ఉదయం మార్నింగ్ వాకర్స్ వాకింగ్ చేస్తున్న సమయంలో చెరువులో మహిళ మృతిచెంది తేలియాడుతూ కనిపించడాన్ని గుర్తించారు. కాగా, స్థానికుల సాయంతో పోలీసులకు సమాచారం అందజేశారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.