మీడియా ప్రతినిధులకు మెగా ఉచిత వైద్య శిబిరం
నంద్యాల ఆర్డీవో కార్యాలయ సమీపంలోని అర్బన్ ప్రైమరీ హెల్త్ సెంటర్‌లో ఇవాళ మెగా ఉచిత వైద్య శిబిరాన్ని జిల్లా కలెక్టర్ రాజకుమారి గణియా ప్రారంభించారు. జిల్లా యంత్రాంగం, సమాచార పౌరసంబంధాల శాఖ, వైద్య ఆరోగ్యశాఖల ఆధ్వర్యంలో మీడియా ప్రతినిధుల కోసం ఈ శిబిరం ఏర్పాటు చేశారు. మీడియా ప్రతినిధులు ఆరోగ్య పరీక్షలు చేయించుకున్నారు.