VIDEO: ఆలయంలో కూచిపూడి నృత్య ప్రదర్శన
కోనసీమ: అయినవిల్లి సిద్ధి వినాయక స్వామి వారి ఆలయంలో ఆదివారం చైత్ర శుద్ధ ఏకాదశి పుణ్యదినం సందర్భంగా భక్తుల అధిక సంఖ్యలో వచ్చి స్వామివారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా అచ్యుతాపురంకి చెందిన జ్ఞానవి అకాడమీ వారు మొదటి కూచిపూడి నృత్య ప్రదర్శన స్వామివారి సన్నిధిలో ప్రారంభించారు. వారు వేసిన నృత్యం పలువురి భక్తులను ఆకట్టుకుంది.