నిర్లక్ష్యం.. చెత్త కుప్పలో దర్శనమిచ్చిన ఉత్తరాలు
BHNG: నిర్లక్ష్యంతో ప్రజలకు అందాల్సిన ఉత్తరాలు చెత్త కుప్పలో దర్శనమిచ్చిన ఘటన సంస్థాన్ నారాయణపురంలో కలకలం రేపింది. కీలక ఉత్తరాలను సిబ్బంది చెత్తకుప్పలో పడేసినట్లు ఓ ప్రముఖ పత్రిక తెలిపింది. జనవరి, ఫిబ్రవరి 2026కు చెందిన కోర్టు, బ్యాంకు, బీమా నోటీసులు సహా పలు లేఖలు అందులో దొరికాయి. సమాచారం అందుకున్న పోస్టు మాస్టర్ బాధ్యులపై చర్యలు తీసుకుంటామని తెలిపారు.