ఢిల్లీ కారు పేలుడు కేసులో కీలక పురోగతి
ఢిల్లీ కారు పేలుడు కేసులో కీలక పురోగతి లభించింది. బ్లాస్ట్ అయిన కారులో 2 కిలోల పేలుడు పదార్థాలు ఉన్నట్లు పోలీసులు వెల్లడించారు. అమ్మోనియం నైట్రేట్ ఉపయోగించినట్లు గుర్తించారు. అమ్మోనియం నైట్రేట్‌కు పెట్రోలియం ఆయిల్ డిటోనేటర్లను కూడా అమర్చినట్లు తెలిపారు. ఘటనాస్థలం నుంచి 52కు పైగా శాంపిల్స్ సేకరించారు.