సీఎం, డిప్యూటీ సీఎంకు శ్రీధర్ బాబు ఆహ్వానం
TG: ఈ నెల 8, 9 తేదీల్లో తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్‌ను రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తుంది. ఈ క్రమంలో సమ్మిట్‌కు హాజరు కావాలని కోరుతూ కర్ణాటక సీఎం సిద్ధరామయ్య, DY CM డీకేను రాష్ట్ర మంత్రి శ్రీధర్ బాబు బెంగళూరులో కలిశారు. ఈ సందర్భంగా తెలంగాణ రైజింగ్ 2047 విజన్ డాక్యుమెంట్ గురించి వారికి వివరించి ఆహ్వాన పత్రికను అందించారు.