బైకులు ఢీకొని.. ఇద్దరికి గాయాలు

వల్లూరు మండల పరిధిలో మంగళవారం రోడ్డు ప్రమాదం జరిగింది. కుమారునిపల్లి నుంచి కడపకు వెళ్తున్న బైక్, కడప నుంచి కమలాపురం వస్తున్న బైక్ కపిల్చిట్ సమీపాన ఎదురెదురుగా ఢీకొన్నాయి. ఈ ఘటనలో ఇద్దరికి గాయాలయ్యాయి. చికిత్స నిమిత్తం కడప రిమ్స్ ఆసుపత్రికి తరలించారు.