రూ.40 లక్షలతో నిర్మించి నిరుపయోగంగా వదిలేశారు!
విజయనగరం: గరివిడి మండలం కాపుశాంబా సొసైటీ పరిధిలో బాగువలస గ్రామంలో బహుళ ప్రయోజన సౌకర్య కేంద్రాన్ని నిర్మించి నిరుపయోగంగా వదిలేశారు. ఈ కేంద్రానికి 2023లో రూ. 40 లక్షలతో నిర్మించారు. కేంద్రం ప్రారంభం చేయకపోవడంతో రైతులకు స్టోరేజ్ చేసుకునే అవకాశం లేదని రైతులు ఆవేదన వ్యక్తపరుస్తున్నారు. ప్రస్తుత జొన్న రేటు తగ్గిందని అన్నారు. కేంద్రం ప్రారంభించాలని కోరుతున్నారు.