మీ బరువు ఎంత?: రిపోర్టర్ ప్రశ్నపై మండిపడ్డ నటి
తన సినిమా ప్రమోషన్స్‌లో నటి గౌరీ కిషన్‌కు చేదు అనుభవం ఎదురైంది. ఆ సినిమాకు సంబంధించి చెన్నైలో ప్రెస్ కాన్ఫరెన్స్ జరుగుతుండగా.. ఓ రిపోర్టర్.. మీ బరువు ఎంత? అని గౌరీని ప్రశ్నించగా.. ఆమె ఆగ్రహం వ్యక్తం చేసింది. 'నా బరువు గురించి మీకెందుకు?. తెలుసుకుని ఏం చేస్తావు?. ఇలా బాడీ షేమింగ్ చేయడం ఆపండి. నా సినిమా గురించి మాట్లాడండి' అని ఫైర్ అయింది.