కట్ట లింగంపేట సర్పంచ్‌గా కాంగ్రెస్ అభ్యర్థి గెలుపు
Srcl: చందుర్తి మండలం కట్ట లింగంపేట గ్రామ పంచాయతీ సర్పంచ్‌గా ఆవారి రమేష్ ఘన విజయం సాధించారు. కాంగ్రెస్ పార్టీ మద్దతుతో సమీప ప్రత్యర్థిపై 17 ఓట్ల మెజారిటీతో గెలిచారు. తమను గెలిపించిన గ్రామస్థులకు రమేష్ కృతజ్ఞతలు తెలిపారు. తన గెలుపునకు సహకరించిన కాంగ్రెస్ పార్టీకి ధన్యవాదాలు తెలియజేశారు.