'బాధితులకు సహాయక కిట్లు పంపిణీ'

KMR: గాంధారి మండలంలో ఇటీవల కురిసిన భారీ వర్షాలకు పాక్షికంగా దెబ్బతిన్న ఇళ్ల లబ్ధిదారులకు మంగళవారం రెడ్ క్రాస్ సొసైటీ ఆధ్వర్యంలో సహాయక కిట్లను పంపిణీ చేశారు. జిల్లా కలెక్టర్ చేతుల మీదుగా రైతు వేదికలో జరిగిన ఈ కార్యక్రమంలో బాధితులకు దుప్పట్లు, చీరలు, సబ్బులు, అందజేశారు. ఎల్లారెడ్డి ఆర్డీవో, తహసీల్దార్, ఎంపీడీవో, రెడ్ క్రాస్ సొసైటీ సభ్యులు ఉన్నారు.