ఆడవాళ్లకు కనీస మర్యాద ఇవ్వండి: పాండ్యా
హార్దిక్ పాండ్యా, తన గర్ల్‌ఫ్రెండ్ మహికా శర్మను కొందరు ఫొటోగ్రాఫర్లు అసభ్యకరంగా ఫొటోలు తీయడంపై SMలో తీవ్రంగా స్పందించాడు. మహికాను ఫొటోలు తీయడంలో కొందరు హద్దులు దాటినట్లు అతడు తెలిపాడు. 'ఆడవాళ్లు ఇబ్బంది పడేలా ఉన్న కోణంలో వాటిని ఫొటోలు తీశారు. సెన్సేషనలిజం కోసం వ్యక్తిగత గోప్యతకు గౌరవం ఇవ్వడం లేదు. ఆడవాళ్లకు మనం కనీస మర్యాద ఇవ్వాలి' అని పాండ్యా పేర్కొన్నాడు.