కాపులూరు హైస్కూల్‌కు లెవలింగ్ నిధుల వినతి
TPT: నాయుడుపేట మండలం కాపులూరు ప్రభుత్వ హైస్కూల్ ఆవరణ లెవలింగ్ పనులకు నిధులు మంజూరు చేయాలని టీడీపీ నేత చక్రపాణి ఎమ్మెల్యే డా. నెలవల విజయశ్రీకి వినతి పత్రం అందజేశారు. వర్షాకాలంలో నీరు నిల్వ ఉండి విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నట్లు వివరించగా, సమస్యను త్వరలో పరిష్కరిస్తామని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు.