జాతర సందర్భంగా భక్తులకు మంత్రి సీతక్క శుభాకాంక్షలు

జాతర సందర్భంగా భక్తులకు మంత్రి సీతక్క శుభాకాంక్షలు

MLG: మేడారం సమ్మక్క–సారలమ్మ మహా జాతరకు తరలివచ్చే భక్తులందరికీ మంత్రి సీతక్క మంగళవారం హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. ఈ మహాజాతర భక్తుల జీవితాల్లో శాంతి, ఆనందం నింపాలని ఆకాంక్షించారు. భక్తుల సౌకర్యం, భద్రత కోసం ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసిందని తెలిపారు. భక్తులు సురక్షితంగా దర్శనం చేసుకుని ప్రశాంతంగా తిరిగి వెళ్లాలని కోరారు.