కట్టలేరుకు చేరుతున్న వరద నీరు

కట్టలేరుకు చేరుతున్న వరద నీరు

NTR: గంపలగూడెం మండలం వినగడప, తోటమూల గ్రామాల మధ్య ఉన్న కట్టలేరు వాగుకు వరద నీరు చేరుతోంది. ఎగువున కురుస్తున్న భారీ వర్షాలకు తోడు, నియోజకవర్గంలో కురుస్తున్న వర్షాలకు వరద నీరు చేరి ఉధృతంగా ప్రవహిస్తోంది. ప్రస్తుతం తాత్కాలిక బ్రిడ్జిపై వాహనాలు వెళుతుండగా, వరద నీరు పెరగడంతో రాకపోకలు చేసే స్థానిక ప్రజలు ఇబ్బందు పడుతున్నారని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.