లక్ష్మీనారాయణను పరామర్శించిన పల్లె రఘునాథరెడ్డి
సత్యసాయి: తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న టీడీపీ సీనియర్ నాయకులు, నల్లమాడ మండలం ఎర్రవంకపల్లికి చెందిన అన్నం లక్ష్మీనారాయణ కుటుంబాన్ని మాజీ మంత్రి డాక్టర్ పల్లె రఘునాథరెడ్డి పరామర్శించారు. ఆయన ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. లక్ష్మీనారాయణకు మెరుగైన వైద్యం అందేలా చూస్తామని, పార్టీ తరఫున అన్ని విధాలా అండగా ఉంటామని పల్లె రఘునాథరెడ్డి భరోసా ఇచ్చారు.