ప్రతి ఒక్కరూ మొక్కలను సంరక్షించాలి

ప్రతి ఒక్కరూ మొక్కలను సంరక్షించాలి

SKLM: గంగువారి సిగడాం మండలం డి.ఆర్ వలస శివాలయం ఆవరణలో గురువారం ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు మొక్కలు నాటారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వనజీవి రామయ్య స్పూర్తితో నేటికి 26 మొక్కలు నాటానని అన్నారు. అందరూ మొక్కలు నాటి పర్యావరణాన్ని పరిరక్షించాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఆయనతో పాటు పలువురు నాయకులు, కార్యకర్తలు, తదితరులు ఉన్నారు.