VIDEO: కొవ్వాడలో చెరువులు కలుషితం

VIDEO: కొవ్వాడలో చెరువులు కలుషితం

VZM: పూసపాటిరేగ మండలంలోని కొవ్వాడ అగ్రహారంలోని చెరువులు కలుషితమవుతున్నాయని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సమీపంలో ఉన్న పరిశ్రమల వ్యర్ధాల కారణంగా చెరువులో ఉన్న చేపలు చనిపోతున్నాయని చెబుతున్నారు. పర్యావరణం పైనే కాకుండా ప్రజారోగ్యంపై కూడా ప్రభావం చూపుతోందని ఆందోళన చెందుతున్నారు. ఇంత జరుగుతున్నా సంబంధిత అధికారులు స్పందించడం లేదని ఆరోపిస్తున్నారు.