రాకాసి అలలకు మత్స్యకారుడు మృతి

రాకాసి అలలకు మత్స్యకారుడు మృతి

SKLM: గార(M) బందరువానిపేట సముద్ర జలాల్లో బుధవారం మధ్యాహ్నం రాకాసి అలలకు రెండు పడవలు బోల్తా పడ్డాయి. ఈ ప్రమాదంలో గ్రామానికి చెందిన మత్స్యకారుడు గజేంద్ర (52) మృతి చెందగా పలువురుకి గాయాలయ్యాయి. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.