అంకోలిలో మెగా రక్తదాన శిబిరం
ఆదిలాబాద్ రూరల్ మండలం అంకోలి గ్రామంలోని రైతు వేదికలో సోమవారం గ్రామస్థులు మెగా రక్తదాన శిబిరం నిర్వహించారు. రూరల్ ఎస్సై విష్ణువర్ధన్, గ్రామ సర్పంచ్ కిషన్, ఉపసర్పంచ్ దత్తు, వైద్యులు ముఖ్యఅతిథులుగా పాల్గొన్నారు. యువకులు ముందుకు వచ్చి స్వచ్ఛందంగా రక్తదానం చేయడం ప్రశంసనీయమని వారు అభినందించారు.