బాల్య వివాహాలపై అవగాహన సదస్సు
ELR: పెదవేగి మండలం విజయరాయి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో బాల్య వివాహాలు వల్ల కలిగే అనర్ధాలపై అవగాహన సదస్సు శుక్రవారం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి కె.రత్న ప్రసాద్ హాజరయ్యారు. చిన్న వయస్సులో వివాహాలు జరిగితే బాలికలు శారీరకంగా, మానసికంగా పరిణితి చెందరని తద్వారా ఆరోగ్య సమస్యలు వస్తాయన్నారు.