శిథిలావస్థలో నిట్టపుట్టు పాఠశాల.. మరమ్మత్తులకు డిమాండ్

శిథిలావస్థలో నిట్టపుట్టు పాఠశాల.. మరమ్మత్తులకు డిమాండ్

ASR: పెదబయలు మండలం నిట్టపుట్టులో 20 ఏళ్ల క్రితం కట్టిన స్కూల్ నేడు శిథిలమైంది. పైకప్పు రేకులు ఊడిపోయి పిల్లలకు రక్షణ లేకుండా పోయింది," అని గిరిజన విద్యార్థి సంఘం నేత బూడిద మాధవ్ ఆవేదన వ్యక్తం చేశారు. ఈ రోజు నిట్టపుట్టు పాఠశాలను పరిశీలించిన ఆయన, అధికారుల నిర్లక్ష్యంపై మండిపడ్డారు. తక్షణమే భవనానికి మరమ్మతులు చేపట్టాలని డిమాండ్ చేశారు.