ఆలయ నిర్మాణానికి విరాళం అందజేత

నిజామాబాద్: ఎడపల్లి మండలం కుర్నాపల్లి గ్రామంలో నూతనంగా నిర్మిస్తున్న శ్రీ లక్ష్మి నరసింహ స్వామి మందిరంకు బీజేపీ జిల్లా నాయకులు కందగట్ల రాంచంధర్ ఆదివారం రూ . 20,001 విరాళంగా అందజేశారు. ఈ సందర్భంగా గ్రామస్తులు ఆయనకు ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు లక్ష్మణ్ గౌడ్, కట్కాo సుధాకర్, తదితరులు పాల్గొన్నారు.