కార్పొరేషన్ హైస్కూల్‌ను సందర్శించిన మంత్రి
NLR: నగరంలో ఉదయం నుంచి మంత్రి డాక్టర్ పొంగూరు నారాయణ పర్యటిస్తున్నారు. మున్సిపల్ పాఠశాలలను తనిఖీ చేస్తు మౌలిక సదుపాయాలపై ఆరా తీస్తున్నారు. రామ్మూర్తి నగర్ కరణాల మిట్ట మున్సిపల్ కార్పొరేషన్ హైస్కూల్‌ను సందర్శించిన మంత్రి, జరుగుతున్న అభివృద్ధి పనులను పరిశీలించారు. విద్యార్థులకు అవసరమైన మౌలిక వసతులు కల్పించాలని ఆదేశించారు.