డీఐజీతో బీసీ కార్పొరేషన్ ఛైర్మన్ భేటీ
KRNL: రాయలసీమ రేంజ్ డీఐజీ కోయ ప్రవీణ్‌ను బీసీ కార్పొరేషన్ ఛైర్మన్ బొజ్జమ్మ ఇవాళ మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ భేటీలో రాయలసీమ అభివృద్ధి, బీసీ వర్గాల సంక్షేమం తదితర అంశాలపై ఇరువురు విస్తృతంగా చర్చించారు. ఈ సందర్భంగా ప్రాంతంలో శాంతి భద్రతలు మెరుగుపడేందుకు పోలీసులు చేస్తున్న కృషిని ఛైర్మన్ బొజ్జమ్మ ప్రశంసించారు.