VIDEO: ప్రధానమంత్రి ఆవాస్ యోజనను వేగవంతం చేయండి

ప్రకాశం: ప్రధానమంత్రి ఆవాస్ యోజన కార్యక్రమంలో భాగంగా పేదల ఇళ్ల నిర్మాణాలను వేగవంతం చేయాలని గృహ, పట్టణ వ్యవహారాల కమిటీ ఛైర్మన్, ఒంగోలు పార్లమెంట్ సభ్యులు మాగుంట శ్రీనివాసులు రెడ్డి చెప్పారు. ఢిల్లోలోని పార్లమెంట్ భవనంలో మంగళవారం జరిగిన కమిటీ సమావేశానికి మాగుంట అధ్యక్షత వహించి మాట్లాడారు. సమీక్షలో గృహ, పట్టణ వ్యవహారాల శాఖ అధికారులు, సభ్యులు పాల్గొన్నారు.