'జనసేన సభ్యత్వ నమోదు ప్రక్రియను వేగవంతం చేయాలి'

'జనసేన సభ్యత్వ నమోదు ప్రక్రియను వేగవంతం చేయాలి'

KKD: జనసేన పార్టీ సంస్థాగత బలోపేతానికి సభ్యత్వ నమోదు ఎంతో కీలకమని కాకినాడ ఎంపీ తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్ అన్నారు. కాకినాడలోని తన క్యాంపు కార్యాలయంలో జగ్గంపేట నియోజకవర్గ నాయకులు, 'సాధక్'లతో గురువారం సమీక్ష నిర్వహించారు. ప్రజా సమస్యలపై జనసేన చేస్తున్న పోరాటాన్ని ప్రతి ఇంటికీ తీసుకెళ్లాలని కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు.