VIDEO: బర్త్ డే స్పెషల్.. అన్న క్యాంటీన్‌లో సీఎం అల్పాహారం
GNTR: సీఎం చంద్రబాబు 76వ జన్మదినం సందర్భంగా తుళ్లూరు మండలం రాయపూడిలో 270వ అన్న క్యాంటీన్‌ను ఆయన ప్రారంభించారు. అనంతరం అక్కడే చంద్రబాబు దంపతులు పేదలతో కలిసి అల్పాహారం చేశారు. అన్న క్యాంటీన్లలో అందిస్తున్న ఆహారం పట్ల సీఎం సంతృప్తి వ్యక్తం చేశారు. కాగా, ఇవాళ రాష్ట్రవ్యాప్తంగా అన్ని అన్న క్యాంటీన్లలో ఉచిత భోజనం కల్పిస్తున్న విషయం విదితమే.