ఘనంగా అంబేద్కర్ జయంతి వేడుకలు
MLG: కాసిందేవిపేటలో అంబేద్కర్ 135వ జయంతిని ఘనంగా నిర్వహించారు. సర్పంచ్ వాంకుడోత్ నిరోషా అమర్ సింగ్ పూలమాల వేసి నివాళులర్పించారు. విద్యార్థులు అంబేద్కర్ ఆశయాలతో ఉన్నత విద్యలు అభ్యసించాలని సూచించారు. సమాజంలో కులమత భేదాలు లేకుండా ఐక్యంగా ఉండాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో గ్రామ ప్రజాప్రతినిధులు, సిబ్బంది, యువత పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.