రెండు ప్రభుత్వ ఉద్యోగాలతో యువతి సత్తా

ATP: రాయదుర్గం నియోజకవర్గం కణేకల్లు మండలం నల్లంపల్లి గ్రామానికి చెందిన గొల్ల సరిత రెండు ఉద్యోగాలకు ఎంపికైంది. ఇప్పటికే కానిస్టేబుల్ ఉద్యోగానికి ఎంపికైన ఆమె, తాజాగా డీఎస్సీ మెరిట్ జాబితాలో స్కూల్ అసిస్టెంట్‌గా 54వ ర్యాంకు సాధించి టీచర్ ఉద్యోగం సాధించింది. పేద కుటుంబం నుంచి వచ్చిన ఆమె రెండు ప్రభుత్వ ఉద్యోగాలకు ఎంపిక కావడంతో తల్లిదండ్రులు సంతోషం వ్యక్తం చేశారు.