'అర్హత గల జర్నలిస్టులకే అక్రిడేషన్ కార్డులు'
MDK: జిల్లా కలెక్టరేట్‌లో కలెక్టర్ ప్రతిమా సింగ్ అధ్యక్షతన జిల్లా మీడియా అక్రిడిటేషన్ కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. కేవలం నిజమైన, అర్హత కలిగిన జర్నలిస్టులకే అక్రిడిటేషన్ కార్డులు అందేలా చూడాలని కమిటీ సభ్యులకు, DPROకు సూచించారు. నిబంధనల ప్రకారం దరఖాస్తులను క్షుణ్ణంగా పరిశీలించాలని ఆదేశించారు.