చెట్లను నాటి కాలుష్యాన్ని తగ్గిద్దాం

NZB: ఏర్గట్ల మండలం తడపాకల్ గ్రామంలోని ZPHS పాఠశాలలో చెట్లు నాటే కార్యక్రమాన్ని నిర్వహించారు. పర్యావరణ పరిరక్షణ మనందరి బాధ్యత అని పాఠశాల హెడ్‌మాస్టర్ జావిద్ పేర్కొన్నారు. నాటిన మొక్కలను సంరక్షించాలని కోరారు. చెట్లను నాటి కాలుష్యాన్ని తగ్గిద్దామన్నారు. చెట్లు ఉంటేనే మానవాళికి మనుగడ ఉంటుందన్నారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు పాల్గొన్నారు.