శాంతి ర్యాలీ ఆహ్వాన పత్రికల ఆవిష్కరణ

హన్మకొండ: కాజీపేట మండల కేంద్రంలో నేడు శాంతి ర్యాలీ ఆహ్వాన పత్రికలను పాస్టర్ అసోసియేషన్ సభ్యులు విడుదల చేశారు. గ్రేటర్ వరంగల్ క్రిస్టియన్ ఫెలోషిప్ ఛైర్మన్ డానియల్ కళ్యాణపు ఆధ్వర్యంలో ఈనెల 7న ఉదయం 8 గంటలకు పబ్లిక్ గార్డెన్ నుంచి శాంతి ర్యాలీ కలెక్టరేట్ వరకు నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమంలో అశోక్ పాల్, బోడ డిన్నర్ తదితరులు పాల్గొన్నారు.