'నూతన ఆసుపత్రికి కిషన్ రావు పేరు పెట్టాలి'

SRD: పటాన్ చెరువు పట్టణంలో రూ. 185 కోట్ల CSR నిధులతో నిర్మిస్తున్న నూతన ఆసుపత్రికి దివంగత డాక్టర్ కిషన్ రావు పేరు పెట్టాలని పలువురు డిమాండ్ చేస్తున్నారు. నగరంలో కాలుష్యానికి వ్యతిరేకంగా ఎన్నో పోరాటాలు చేసిన ఘనత కిషన్ రావుదని వారు పేర్కొన్నారు. సుప్రీంకోర్టులో కేసు వేసి మరి రూ. 567 కోట్ల CSR నిధులు తెప్పించారని, ఆసుపత్రికి ఆయన పేరు పెట్టడమే సముచితమని భావిస్తున్నారు.