రైలులో చిన్నారిపై లైంగిక దాడి
KDP: రైలులో చిన్నారిపై లైంగిక దాడి కేసులో బుధవారం కడప పోక్సో కోర్టు చారిత్రక తీర్పునిచ్చింది. నిందితుడు రామ్ ప్రసాద్ రెడ్డికి జీవిత ఖైదు, రూ.10 వేల జరిమానా విధిస్తూ జడ్జి ప్రవీణ్ కుమార్ ఆదేశించారు. బాధితురాలికి రూ.10.50 లక్షల పరిహారం చెల్లించాలని గుంతకల్ డీఆర్ఎంను తెలిపింది. శిక్ష పడేలా కృషి చేసిన రైల్వే సిబ్బందికి బాధితులు కృతజ్ఞతలు తెలిపారు.