జగన్నాధపురం సర్పంచ్ వినూత్న ఆలోచన

VZM: బొబ్బిలి మండలంలోని జగన్నాధపురం గ్రామంలో చెత్త తొలగింపు కోసం ప్రత్యేక చర్యలు చేపట్టారు. సర్పంచ్ బొద్దల పద్మ ఆధ్వర్యంలో రహదారుల పక్కన శాశ్వత చెత్త నిక్షేపణ కుండీలను ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా సర్పంచ్ సోమవారం గ్రామంలో పర్యటించి ప్రజలకు అవగాహన కల్పించారు. పరిసరాలను పరిశుభ్రంగా ఉంచేందుకు ప్రజల సహకరించాలన్నారు.