మౌంట్ యూనం శిఖరాన్ని అధిరోహించిన గిరిజన యువకుడు

ASR: హుకుంపేట మండలం అడ్డుమండ గ్రామానికి చెందిన సంపంగిబోయిన ఆనంద్ బాబు అనే గిరిజన యువకుడు మౌంట్ యూనం శిఖరం అధిరోహించారు. ఇందులో భాగంగా 6,111 మీటర్ల ఎత్తైన మౌంట్ యూనం శిఖరాన్ని ఆనంద్ బాబు, 5,900 మీటర్ల వరకు అధిరోహించారు. అక్కడ హిమపాతం ఎక్కువ అయింది. దీంతో అక్కడే జాతీయ పతాక ఆవిష్కరణ చేశారు. తన యాత్రకు సహకరించిన ఐటీడీఏ పీవో అభిషేక్‌కు కృతజ్ఞతలు తెలిపారు.